World Public Library

దశావతార స్తోత్రములు (Dasãvatãra Hymns)

రచన - కోసూరి రాఘవ, గాత్రం - వడ్లమాని కామేశ్వరరావు

2019

Abstract

రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! రామా ! నీ మహిమలెన్న తరమా! సనకాదుల కైనా! 1 వచ్చి వారధిని జొచ్చి సోమకుని హెచ్చు శరంబుల గృచ్చి సుతులగొని ఇచ్చతొ వేగమె - తెచ్చి విధాతకు హెచ్చరికతొ నివు ఇచ్చి ఏలితివి మత్స్యావతారా జై మత్స్యావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 2 సురలు శరణుయని సోంపుతొ వేడగ కరుణతో మందర గిరిపృష్ఠమునను గురుతుగ నిడుకొని - వరదేవతలను నిరుపమానముగ - నీవు బ్రోచితివి కూర్మావతార జై కూర్మావతార. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 3 మనమున లేశము కరుణ లేకయా కనకాక్షుడు భువి కలసి చుట్టగను సనకసనందన మునులు వేడగను దనుజుని చుట్టియు ధర ఏలితవౌ వరాహావతారా జై వరాహావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 4 పరి పరి విధముల ప్రహ్లాదుడు నిను హరి హరి యనుచును మొరలిడగా విని కరమున హిరణ్య కశిపు వక్షమున వరనఖములచే వ్రక్కలు చేసిన నరసింహావతారా జై నరసింహావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 5 ముదముతొ బలి మూడడుగుల దానము సదయుడవని సంతృప్తిగ నొసగిన వదలక దైత్యుని వడి వేగంబున పదముల నణచిన పరాక్రముడవౌ వామ్నావతార జై వామ్నావతార రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 6 కరుణ లేక నివు ..కడు శైర్యముతో వరాయుధంబున - వసుధాస్థలిపై ఇరువదియున్నొక మారు భూపతుల శిరములు కూలగ శరముల నేసిన రామావతారా పరశురామావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 7 దేవర బ్రహ్మేంద్రాదులు బెబ్బున కావు మనగ కౌసల్య పుత్రయా రావణ మొదలగు రాక్షస సంతతి జీవ మడంచి విభీషను బ్రోచిన రామావతారా జై శ్రీరామావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 8 కన్నెల చీరలు అన్నియు దొంగిలి చెన్ను మీరగను పొన్న గున్నపై వెన్న దొంగయా చిన్ని కృష్ణునికి అన్నవు కదరా ఎన్నిక హలధర రామావతారా బలరామావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 9 హద్దు మీరకను హరి నీ సేవయు వొద్దిక తోడను .. వెదకి సేయ పరి- శుధ్ద జనుల నివు సూటిగ కనుగొని సద్దు సేయగను సరగున బ్రోచిన బౌధ్ధావతారా జై బౌధ్ధావతారా. రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! 10 ఇల సుజనుల నివు ఇంపుతొ గనుగొని ఖలులను కనుగొని ఖండించుటకును జలజనయనయీ కలియుగాంతమున కలికి మూర్తివై కలిగెదవౌరా కల్కావతార జై కల్కావతార రామా ! నీ మహిమలెన్న తరమా! బ్రహ్మాదుల కైనా ! వాసిగ ఇరగవ రాధీశుడవై కేశవ నీ కృప - లేశము మరువక భాసురముగ - కోసూరి రాఘవ దాసుని హృదయ - నివాసుడ వ

Read this work at the World Public Library (library card needed).