World Public Library

Sudhaamaa Satakamu

Bharatam Arunachala Sastry, Polisetty Veera Subrahmanya Kumar, Editor

Abstract

71. సృష్టిఁగల మేటి సొత్తు - స మష్టిగఁ బంచేంద్రియముల మాయఁదగులకే ేేేస్పష్టమగు పరమ హృత్సం తుష్టిని - మోక్షానుభూతి - తొడరు సుధామా! సృష్టిన్ + కల మేటి సొత్తు = ఈ సృష్టిలోని విలువగల ధనమైన; మోక్ష + అనుభూతి = పరమాత్మానంద అనుభవము; సమష్టిగన్ = ఉమ్మడిగా; పంచ + ఇంద్రియముల = కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అను 5 ఇంద్రియముల; మాయన్ + తగులకే = మాయకు చిక్కుకొని పోక; స్పష్టము + అగు = సువ్యక్తమగు; పరమ హృత్ + సంతుష్టినిన్ = పరమమునకు చేర్పబడిన హృదయము యొక్క సంతుష్టిచే; తొడరున్ = కలుగును. ఓ సుధామా! ఇంద్రియముల (కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము – అను పంచేంద్రియముల) మాయకు అందక కేవలమూ పరమాత్మను హృదయమందు కనుగొనుటచే తృప్తిచెందిన వాని ప్రత్యక్షజ్ఞానము వలన – ఈ సృష్టిలోని గొప్ప సొత్తు అయిన మోక్షము లభించును సుమా!

Read this work at the World Public Library (library card needed).